08-02-2025 11:30:53 PM
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా ‘తల’. ఈ చిత్రంలో అంకిత నస్కర్ హీరోయిన్‌గా నటించింది. రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, సత్యం రాజేశ్, ముక్కు అవినాశ్, ఇంద్రజ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పాట వినగానే వెంటనే కనెక్ట్ అయిపోయేలా ఉంది. బిగ్‌బాస్ ఫేమ్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశారు.
ఈ పాటను తమిళ్‌లో టి రాజేందర్ పాడారు. తెలుగులో ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్‌పై చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా సాహిత్యం ఉంటుంది. ‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పుడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాట లిరిక్స్ ఈ తరం యూత్‌కు బాగా నచ్చుతాయి. ఈ చిత్రం ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కానుంది.