calender_icon.png 18 November, 2024 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల పెండింగే ప్రధాన సమస్య

02-09-2024 12:25:45 AM

లైంగికదాడుల కేసులపై రాష్ట్రపతి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల కేసులు కోర్టుల్లో సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉండటమే దాడు లు మరింత పెరగటానికి కారణమవుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా న్యాయస్థానాల రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆదివారం ఆమె ప్రసంగించారు. ‘రేప్‌లాంటి కేసులో కోర్టుతీర్పు రావటానికి తరాలు పడితే.. సామాన్య పౌరుడు అసలు తనకు న్యాయమే జరుగలేదని భావిస్తాడు’ అని పేర్కొన్నారు. గ్రామాల్లో న్యాయవ్యవస్థను పవిత్రంగా భావిస్తారని గుర్తుచేశారు. ‘భగవంతుని సన్నిధిలో న్యాయం ఆలస్యం కావొచ్చేమో కానీ.. అన్యా యం జరుగదనే నమ్మకం ఉంటుంది. కానీ ఎంత ఆలస్యంగా? ఎంతకాలం పడుతుంది? దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. వాయిదాల సంస్కృతిని మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.