calender_icon.png 26 February, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన లక్ష్యం

25-02-2025 10:50:51 PM

మంచిర్యాల డీసీపీ భాస్కర్..

మంచిర్యాల (విజయక్రాంతి): ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం సాయంత్రం సిసిసి నస్పూర్ లోని ఏ ఎస్ ఆర్ కన్వెన్షన్ హాలులో పోలింగ్ భూత్ ల వద్ద, ఇతర డ్యూటీలు, రూట్ మొబైల్స్ ఇంచార్జి అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పలు సూచనలు, ఆదేశాలు చేశారు.

ఎన్నికల నిర్వహణ పట్ల, చేయవలసిన విధుల పట్ల, మొబైల్ పార్టీల, పోలింగ్ సమయం తదితరులపై అవగాహన కల్పించారు. ఎన్నికల విధులలో సిబ్బంది ఎవ్వరూ కూడా అలసత్వం చూపరాదని, ఎన్నికల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఏ చిన్న సంఘటన జరిగడానికి ఆస్కారం ఉన్న వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.