10-04-2025 06:19:58 PM
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల జిల్లా రెండవ మహాసభను విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు తోపునూరి చక్రపాణి కోరారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... రాబోయే రెండు సంవత్సరాల కార్యక్రమాలు అనుసరించవలసిన వ్యూహము ప్రభుత్వంపై మన సమస్యల మీద గలమెత్తె విధంగా అంశాల మీద చర్చించుట జరుగుతుందన్నారు.
అదే విధంగా ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన కార్మికులు నిత్యవసర బస్సులతో పాటు కోడిగుడ్లు గ్యాస్ సరఫర చేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పదివేల రూపాయలు కార్మికులకు ఇవ్వాలని అదేవిధంగా కార్మికులుగా గుర్తించాలన్నారు. కామారెడ్డి జిల్లాకు సుమారు గత జులై నుండి వేతనాలు అక్టోబర్ నుంచి కోడి గుడ్డు బిల్లు సెప్టెంబర్ నుంచి నైన్త్ అన్ టెంత్ బిల్లు సుమారు 10 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయన్నారు. ఒక బాన్సువాడకే 75 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో జూన్లో కొన ప్రారంభించే పాఠశాలను పూర్తిస్థాయిలో బందు చేసి ఆందోళన చేపడుతామని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ సమావేశంలో చాంద్ పాషా, విజయలక్ష్మి, శేషమ్మ, అమీర్ బేగం, తదితరులు పాల్గొన్నారు.