calender_icon.png 2 February, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతి మహాలక్ష్మీ..నిర్మలమ్మ!

02-02-2025 12:00:00 AM

సోషల్ మీడియాలో మీమ్స్ సందడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైరల్‌గా మారారు. ఆమెపై మీమ్స్ సందడి చేస్తున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తు తూ పోస్టులు పెడుతున్నారు. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు.

ఇది కేవలం మీమ్స్ దగ్గరే ఆగలేదు సరికదా.. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియో లతో మీమర్స్ హల్‌చల్ చేస్తున్నారు. అయితే బీహార్‌కు భారీగా వరాలు కురిపించడంతో నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతు న్నారు. ప్రత్యేకించి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పదే పదే బీహార్ పేరును ప్రస్తావించడమూ “ఆచార్య పాదఘట్టం” తరహాలో నెట్టింట ట్రోల్ అవుతోంది.