calender_icon.png 11 March, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా విమాన గోపుర సుదర్శన ప్రతిష్ట

09-03-2025 08:16:10 PM

కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం...

గజ్వేల్: మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు ఆదివారం విమాన గోపుర సుదర్శన ప్రతిష్ట అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగింది. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు హనుమంతరావు గీత దంపతుల నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహించగా వేద పండితులు తిగుళ్ల సనాతన సారధి వైదిక నిర్వహణ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగం సత్తయ్య, ఆలయ అర్చకులు రాజశేఖర శర్మ, కార్తీక్ శర్మ, భక్తులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.