calender_icon.png 6 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా జాగ్‌భోగ్ బండార్

29-12-2024 02:15:14 AM

* గాంధారి మండలం నేరల్‌తండాలో 15 వేల మందికి అన్నప్రసాదం

* భోగ్ బండార్‌లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శనివారం జాగ్‌భోగ్ బండార్‌ను గిరిజనులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏటా ఈ కార్యక్రమా న్ని గాంధారి మండలం నేరాల్ తండాలో నిర్వహిస్తారు. మాజీ ఎంపీపీ దశరథ్ నాయక్, మాజీ జడ్పీటీసీ శంకర్‌నాయక్ కుటుంబాలు ఈ ఏడాది జాగ్‌భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

సుమారు 15 వేల మంది జాగ్‌భోగ్ బండార్‌లో పాల్గొని ప్రత్యేక భజనలు చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొని నేరాల్‌తండా వాసులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమానికి మహరాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు.