- తాటిపాములలో అనుమతులు లేకుండా యథేచ్ఛగా బ్లాస్టింగ్
- బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
శ్రీరంగాపూర్, జనవరి 16: అక్రమ మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపా లని బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరా రు. గురువారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో అక్ర మంగా బ్లాస్టింగ్ చేస్తున్న ప్రాంతాన్ని మరి యు బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇండ్లను గ్రామ స్తులతో కలిసి పరిశీలించారు.
ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ బి ఆర్ క్రషర్ యజమానులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎదేచ్చగా బ్లాస్టింగ్ చేస్తున్నా కూడా అధికారులు చూసీ చూడన ట్లు వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ వ్యాపారు లకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో సంవత్సరాలుగా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీంతో ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామంలోని ప్రజలు ఎప్పు డు ఏం జరుగుతుందో తెలియక భయం తో జీవిస్తున్నారని అన్నారు.
బ్లాస్టింగ్ శబ్దాని కి పిల్లలు, గర్భిణీలు, వద్ధులు, గుండె జబ్బు లు ఉన్న వారు ప్రాణాలు కోల్పోయే ప్రమా దం ఉందన్నారు. అక్రమ మైనింగ్ మరియు బ్లాస్టింగ్ కార్యకలాపాలు స్థానిక పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు అనుమతుల గురిం చి జిల్లా మైనింగ్ అధికారి, స్థానిక తహసీల్దా ర్ మరియు ఎస్సై లకు ఫోన్ చేసి అడగగా బ్లాస్టింగ్ చేయడానికి తాము ఎలాంటి అను మతులు ఇవ్వలేదని తెలిపారని అన్నారు.
సరైన అనుమతులు లేకుండా, భద్రతా చర్య లు లేకుండా నిర్వహిస్తున్న అనధికార బ్లా స్టింగ్ కార్యకలాపాలను నిలిపివేసి, తాటిపా ముల గ్రామంలోని నివాసితుల జీవితాలకు మరియు ఆస్తులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ర్ట కార్య దర్శి వివి గౌడ్, నాయకులు మహేందర్ నాయుడు, రాఘవేందర్ గౌడ్, దేవర శివ, జితేందర్, మాజీ సర్పంచ్ బజారయ్య, నాగరాజు యాదవ్, వెంకటయ్య, పోషన్న, సుబద్రమ్మ, వెంకటమ్మ, సుశీలమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.