12-02-2025 01:23:01 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): సహజ సిద్ధంగా దొరికే ఇసుకను నిరుపేదలకు అత్యంత చౌకగా అందించా లన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇసుక మన వాహనం పేరుతో నూతన కార్యక్రమాన్ని చేపడుతోంది. సహజ సిద్ధంగా ఏర్పడే ఇసుక మేటలను క్రమ పద్ధతిలో తోడి ప్రజలకు చేరవేసే ప్రక్రియను ఆన్లున్ ద్వారా మైనింగ్ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేయగా ప్రజలకు అత్యంత చౌకగా ఇసుక దొరకడంతో పాటు ప్రభుత్వానికి కూడా తగిన మోతాదులో రాబడి లభిస్తుం దని ప్రభుత్వ ఉద్దేశం.
కానీ కంచె చేను మేసిన చందంగా ఆయా సర్కిల్ పరిధిలోని ప్రధాన పోలీస్, మైనింగ్, రెవెన్యూ అధి కారులు కిందిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఇసుక మాఫియా గ్యాంగ్ వద్ద ఒక్కో ట్రాక్టర్ నుండి 10వేల చొప్పున లక్షల్లో నెలసరి మామూళ్లను వసూళ్లు చేస్తూ అక్ర మ ఇసుక రవాణాకు తెర వెనుక సహకరిస్తు నట్లు బాహాటంగానే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
గత బిఆర్‌ఎస్ పార్టీలో కద్దర్ చొక్కా నేతలంతా ఇసుక మాఫియా నడిపిస్తూ వారి తోపాటు వారి ముఖ్య నేతలకు కూడా రెండు చేతుల సంపాదించి పెట్టారని జగమె రిగిన సత్యం. దాని ప్రతి ఫలంగానే ప్రజా ప్రతినిధులు ఘోరంగా ప్రజల చేతిలో ఓట మి చవిచూశారు. నూతన ప్రభుత్వం పేదల కు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితం గానే ఇసుకను సరఫరా చేస్తామని ఈ మన ఇసుక మన వాహనం కార్యక్రమాన్ని తీసు కొచ్చారు.
దీంతో ఇతరులకు సైతం తక్కువ ధరకే ఇసుక దొరికే ఆస్కారం ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా గత ప్రభుత్వంలో అడ్డ గోలుగా ఇసుక తవ్వుకున్న ఇసుక తోడేళ్లు అధికారం మారగానే పార్టీల్లో చేరి అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నారని జోరుగా చర్చ జరుగుతుంది.
మన ఇసుక వాహనం నడిచినప్పటికీ ఇసుక రవాణా చేసే యజ మానుల నుండి పోలీసులకు నెలవారి మా మూళ్లు మాత్రం అందాల్సిందేనని కింది స్థాయి సిబ్బంది చేత ముక్కు పిండి మరీ వసూలు చేయడంతో ఇదే అదునుగా భావి స్తున్న ఇసుక మాఫియా మరింత రెచ్చిపో యి అర్ధరాత్రిళ్లు కూడా దారులు మార్చి ఇసుక రవాణా జరిపిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
మన ఇసుక వాహనం కోసం బుకింగ్ చేసుకున్న వారికి అక్రమ దారులు సరఫరా చేస్తూ తక్కువరకే ఇసుక ను ఇంటికి చేర్చి మన ఇసుక వాహనాన్ని నీరుగర్చే కుట్రకు తెరలేతున్నట్లు చర్చ నడు స్తోంది. ఆన్లున్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడికి మన ఇసుక వాహనం ద్వారా ఆలస్యం జరుగుతోందని మేము ఒక్కరోజులోనే ఇస్తామంటూ ప్రజల్లో విశ్వా సాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయా ఇసుక రీ వద్ద సమీప గ్రామ రైతులను కూడా అధికారులపై గొడవలకు ఉసిగొల్పి మన ఇసుక వాహనం నడవకుండా కుట్రల కు తెర లేపుతున్నట్లు నడిగడ్డ ఘటన ఉదా హరణగా మిగులుతోంది.
దారులు మార్చి అక్రమ రవాణా..!
నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవ ర్గాలకు ప్రధాన ఇసుక మేటలకు వనరుగా ఉన్న దుందుభి పరివాహక గ్రామాల పరిధి లో అక్రమార్కులు ఇసుకను యదేచ్చగా తవ్వి రాత్రిళ్ళు అక్రమంగా సరఫరా చేసి కోట్ల రూపాయలు పోగు చేసుకుంటున్నారు.
దీంతో గ్రామస్థాయి రైతులు యువజన సంఘాలతో పాటు రెవెన్యూ, పోలీస్, మైనిం గ్ ఇతర పెద్దలను సైతం ముడుపులతో మెప్పించి ఉన్నతాధికారుల కల్లు కప్పి అక్రమ ఇసుక రవాణా యదేచ్ఛగా నడిపి స్తున్నారు. ఆయా స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులంతా అక్రమ ఇసుక రవాణాకు అండ దండగా ఉండడంతో సెలవు దినాల్లో నూ పట్టపగలే ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని మాజీ కౌన్సిలర్ భర్త, మరో మాజీ కౌన్సిలర్ తో పాటు మరి కొందరు వేరు వేరు చోట్ల ఫిల్టర్ ఇసుకను ఏర్పాటు చేసుకొని మరీ అడ్డగోలుగా కృత్రి మ ఇసుకను సరఫరా చేస్తున్నారు. కొల్లాపూ ర్ పరిధిలోని కొండూర్, నిర్మల్ వాగు, తూముకుంట వాగు, ముక్కిడిగుండం, ఉడు ముల వాగు, రామాపురం, అచ్చంపేట పరిధిలోని మొలగర, పెద్దాపూర్, నాగర్ కర్నూల్ పరిధిలోని దుందుభి పరివాహక ప్రాంతాలైన మెడిపూర్, పొల్మూర్, నడిగడ్డ, రామగిరి, కల్వకుర్తి పరిధిలోని పలు వాగు ల్లో అర్థరాత్రిలు ఇసుకను తవ్వి సమీప రైతు కులాల్లో నిల్వ ఉంచుకొని అక్కడి నుంచి అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా గ్యాంగ్ అడ్డదారుల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు.
ఆయా పోలీస్ స్టేషన్ పరిధి లోని అధికారులందరికీ ఇసుక మేటలతో పాటు ఇసుక రీ, ఇసుక డంపుల స్థావరాల న్నీ తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో వస్తున్న ఆరోపణలు నిజమేనని అర్థమ వుతుంది.