26-03-2025 01:26:31 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, మార్చి 25 (విజయ క్రాంతి):, కామారెడ్డి జిల్లా లో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లేఅవుట్ల క్రమబద్దీకరణకు ఈనెల 31తో గడువు ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరగా ఫీజు చెల్లించి 25 శాతం రిబేట్ పొందవచ్చన్నారు. దరఖాస్తుదారులు సకాలంలో లేఅవుట్ల క్రమబద్దీకరణ చేయించుకోవాలని స్పష్టం చేశారు.
దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ ఆర్వో రాజగోపాల్ రెడ్డి, తదితరులు పాలుకొన్నారు.