calender_icon.png 13 January, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజల్ వీరుని ప్రేమ పరిమళం

26-12-2024 12:00:00 AM

గాలిబ్ పేరు వినగానే మనకు మహాకవి దాశరథి కృష్టమాచార్య స్ఫురిస్తారు. కారణం, దాశరథి గాలిబ్ ఉర్దూ గజల్స్‌లోంచి తనకు బాగా నచ్చిన వాటిని ఎన్నుకొని తెలుగులోకి అత్యంత సరళ పదాలతో గేయాలుగా అ నువదించా రు కనుక. దాశరథి ‘గాలిబ్ గీతాలు’ పేరున 1961లోనే అవి పుస్తక రూ పంలోకి వచ్చి గొప్ప ప్రజాదరణను పొం దాయి. మన మ హాకవికి మంచిపేరు తెచ్చిపెట్టిన ఈ గీతాల సృష్టికర్త గాలిబ్ భారతదేశం గర్తించదగ్గ మహోన్నత గజల్ వీరుడు. మీర్జా గాలిబ్ అసలు పేరు మీర్జా బేగ్ అసదుల్లా ఖాన్. దాశరథి అనువదించిన అద్భుత గీతాలు చాలు, గాలిబ్ మహా శయుని సాహిత్య సృ జనా శక్తిని తెలుసుకోవడానికి! వాటిలో ఎంత గాఢమైన భావుకతయో అంతే పదునైన వాస్తవికత.  

భారతదేశానికి లెజెండ్ వంటి మహాకవులలో గాలిబ్ ఒకరు. ఉజ్బెకిస్తాన్‌లోని సా మర్‌ఖండ్ నుంచి వచ్చిన మొఘల్ కు టుంబానికి చెందిన వారాయన. ఆయన జీవితం ఎంత సంక్షోభమో తాను సృష్టించిన కవిత్వం అంత మనోహరమైంది. ఆ నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను గాలిబ్ తన కవితా స్రవంతిలో ప్రవహింపజేశారు. మొఘల్ సామ్రాజ్యం క్షీణత, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రభావం, అలాగే 1857 నాటి భారత సిపాయిల తిరుగుబాటు తరువాత జరిగిన పరిణామాలకు చెందిన సామాజిక స్థితిగతులు ఆయన సాహిత్యంలో ప్రతిఫలించా యి. ఉర్దూ, పర్షియన్ లోనూ ఆయన ఉద్ధండులే. వారి ఉర్దూ కవిత్వం అద్భుత ప్రయోగాలకు ఆలవాలం. 

కష్టాల కొలిమిలోంచి కవిత్వం

క్రీ.శ.1797 డిసెంబరు 27న ఆగ్రాలోని కాలా మహల్‌లో జన్మించిన గాలిబ్ మీర్జా అసదుల్లా బేగ్ ఖాన్‌గా ప్రసిద్ధి చెందారు. ‘గాలిబ్’ ఆయన కలం పేరు. ఆగ్రానుంచి జీవనం కోసం వారి కుటుంబం ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు ఏడేళ్లు. పర్షియన్, అరబిక్, టర్కిష్ భాషలు నేర్చుకున్నారు. తన 11వ ఏటినుంచే పద్యాలు రాయడం మొదలుపెట్టారు. 13 సంవత్సరాల వయస్సులో ఉమ్రావ్ బేగంతో ఆయన వివాహం జరిగింది. చిన్నవయసులోనే తండ్రితోపాటు మేనమామనూ కోల్పోయారు.

జీవనయానంలో అనేక కష్టాలు అనుభవించారు. గాలిబ్ తాను నిజ జీవితంలో అనుభవించిన కఠోర అనుభవాల కే అక్షరరూపం ఇచ్చేవారు. మీర్జా గాలిబ్ మొదటి భాష ఉర్దూ అయినా కుటుంబ నేపథ్యం కారణంగా ఇంట్లో పర్షియన్, టర్కిష్ కూడా మాట్లాడే వారు. ఉర్దూతోపాటు ప్రారంభంలో పర్షియన్, అరబిక్ పాఠాలను చదువుకున్నారు. 19 ఏండ్ల వయస్సులో తన ప్రసిద్ధ గజల్స్ చాలావరకు రాశారు. అవి ప్రధానంగా ప్రేమ, సౌందర్యం, బాధలను వ్యక్తపరిచేవి. 

గాలిబ్ నిజ జీవితంలో మానసికంగా ఎంతో హుషారుగా, చలాకీగా ఉండేవారు. ఆయా సందర్భాలలో ఆయన స్నేహితులకు పంపిన లేఖలలో హాస్యం, చమత్కారం మేళవించేవి. 1857 తిరుగుబాటు తరువాత మొఘల్ సామ్రాజ్య పతనం, బ్రిటిష్ పాలన పెరుగుదల పరిస్థితులను మీర్జా గాలిబ్ నాటి సమాజంలో చవిచూశారు. గాలిబ్ ఏనాడూ రాచరికపు సహాయాలు లేదా స్నేహితుల మద్దతులపై ఆధారపడి జీవనోపాధి పొందలేదు.

మొఘల్ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత, బ్రిటిష్ పాలకుల నుంచి గాలిబ్ తన పూర్తి పింఛన్‌ను  పొందేందుకు ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఆయన అనంతరం ఆయన భార్యకూడా పెన్షన్‌ను సవ్యంగా పొందలేకపోయారు. ఆనాటి సమాజం, కుటుంబ మార్పుల తాలూకు స్థితిగతులు గాలిబ్ గజళ్లు, రచనలలో ప్రతిఫలించేవి. గాలిబ్‌కు ఏడుగురు పిల్లలు కలిగినా, ఏడాది  రెండేడ్లు బతికి మరణించారు. గాలిబ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఉమ్రావు బేగం అనుభవించిన కష్టాలకు అంతులేదు. భర్త సంవత్సరీకం నాడు ఆమెకూడా తనువు చాలించారు.

 గడీల ఛత్రపతి