calender_icon.png 11 January, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీ బోల్తా

16-09-2024 12:00:00 AM

ఒకరి మృతి, మరొకరికి గాయాలు

కాప్రా, సెప్టెంబర్ 15: లారీ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఎఫ్‌సీఐ గోదాం నుంచి బియ్యం లోడుతో వస్తున్న ఓ లారీ.. చర్లపల్లి డివిజన్ హెచ్‌సీఎల్ చౌరస్తా వద్ద అదుపుతప్పి బోర్ల్లా పడింది. ఈ క్రమంలో అది పక్క నుంచి వెళ్తున్న యాక్టివాపై పడటంతో.. దానిని నడుపుతున్న జార్జ్జి (55) అక్కడికక్కడే మృతి చెందగా యాక్టివా వెనుకాల కూర్చున్న మరో వ్యక్తి నితీష్ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుప త్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.