- 15 మంది ప్రయాణికులకు గాయాలు
- ముగ్గురిని వరంగల్ ఆస్పత్రికి తరలింపు
జయశంకర్ భూపాలపల్లి(ములుగు), జూలై 12(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో కండక్టర్‌తో పా టు 15 మంది ప్రయాణికులు గాయపడ్డ సం ఘటన ములుగు మండలం పందికుంట జా తీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదం లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానికులు వారిని వరంగల్ ఆస్పత్రికి తరలించారు. తెలిసిన వివరాల ప్రకారం.. ములుగు వైపు నుంచి ఆర్టీసీ బస్సు 33 మంది ప్రయాణికులతో హనుమకొండకు బయల్దేరింది.
మార్గమధ్యంలోని పందికుంట సమీపంలో బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో బస్సు లో ప్రయాణిస్తున్న 15 మందితో పాటు కండక్టర్‌కు గాయాలు అయ్యాయి. స్వల్పగాయాలపాలైన వారిని 108లో ములుగు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితులను ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, అసిస్టెంట్ మేనేజర్ జ్యోత్స్నపరామర్శించారు.