ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06: అతివేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. యాచారం పీఎస్ పరిధి గోడుకొండ్ల గ్రామం వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన భాస్కర్ (42) కూరగాయల వ్యాపారి. శనివారం గట్టుప్పల్ అంగడిలో కూరగాయలు విక్రయించి తిరిగి ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా పాత మాల్ కూడలి వద్ద మర్రిగూడ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భాస్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్ మృతదేహాన్ని పోస్‌మార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.