03-03-2025 12:25:08 AM
యాదాద్రి భువనగిరి మార్చి 2 (విజయ కాంతి): యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు దాతలు సమర్పించిన బంగారు గరుడ శేష వాహనాల మీద తిరువీధులలో భక్తుల దర్శనార్థం స్వామివారు ఊరేగారు. 12 లక్షల రూపాయల వ్యయంతో తయారు చేయబడిన బంగారు వాహనాలపై స్వామివారు ఊరేగారు.
సాయి పవన్ కన్స్ట్రక్షన్ ఇండియా లిమిటెడ్, గార్ల పార్టీ పెద్ద యాదయ్య, శ్రీమ తి రామలింగేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు చేసిన దాతృత్వంతో బంగారు తాపడం చేయించి స్వామివారికి బహుకరించారు. ఎట్టి బంగారు వాహనాలను బ్రహ్మో త్సవాలు అలంకార సేవలకు వినియోగించబడునని ఆలయ ఈవో భాస్కరరావు తెలి పారు.
హైదరాబాదుకు చెందిన శ్రీ సాయి పావని కన్స్ట్రక్షన్ ఇండియా లిమిటెడ్ దాత సమర్పించిన 12 లక్షల భయంతో గరుడ వాహనాన్ని బంగారు తాపడంతో చేయించి దేవస్థానానికి బహుకరించారు. హైదరాబాదు అనురాధ టింబర్ డిపో వారు బర్మా టేక్‌తో స్వామివారు సేవా పీఠాన్ని ౪ లక్షల తో తయారు చేయించి బహుకరించారు.