calender_icon.png 23 February, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధిస్తున్న యూరియా కొరత

23-02-2025 12:00:00 AM

క్యూలో చెప్పులు ఉంచుతున్న రైతులు

కరీంనగర్/నిర్మల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): యాసంగి పంటకు యూరియా కొరత ఏర్పడింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మూడు రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని క్యూ కడుతున్నారు. తిమ్మాపూర్, గంగాధర మండలాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

సకాలంలో పంటలకు ఎరువులు వేయనిచో పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిగురుమామిడి, రేకొండ, ఇందుర్తి గ్రామాల్లో వ్యవసాయ పరపతి సహకార సంఘాల వద్ద శనివారం రైతులు ఉదయం నుంచి క్యూలో ఎరువుల కోసం బారులుతీరారు.

ఇందుర్తి గ్రామంలో క్యూలో చెప్పులను ఉంచారు. రేకొండలో గంటల తరబడి యూరియా కోసం క్యూలో వేచి చూశారు. నిర్మల్ జిల్లాలోనూ రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కడెం, ఖానాపూర్, లేకేశ్వరం, సారంగపూర్ కుబీర్ మండలాల్లో యూరియ కొరత ఉన్నది.

రైతులు యూరియ కోసం సింగిల్ విండో కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. అక్కడ కూడా అధికారులు ఒక రైతుకు రెండు, మూడు బ్యాగులు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసున్నారు.