calender_icon.png 24 October, 2024 | 4:52 AM

ముంచుకొస్తున్న ‘మంచు యుగం’

24-10-2024 02:49:12 AM

  1. 1,20,000 ఏళ్ల డాటా విశ్లేషణ
  2. 11,700 సంవత్సరాలుగా స్థిరంగానే ఏఎంఓసీ
  3. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రపంచ వ్యాప్తం గా ఎండా, వానా, చలి వంటి మార్పులు కాలాలకు అనుగుణంగా సక్రమంగా జరిగిపోతున్నాయంటే దానికి కారణం సముద్ర ప్రవాహాలు. దీనిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్‌టర్నింగ్ సర్యూలేషన్ (ఏఎంఓసీ).

ఏఎంఓసీ వల్ల భూమధ్య రేఖ ప్రాంతంలో వేడెక్కిన సముద్రపు నీరు భూమికి ఉత్తర, దక్షణ ధృవాల వైపు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలోనే సముద్ర ప్రవాహం పై నుంచి వీచే వెడి గాలులు ముఖ్యంగా ఐరోపా తీర ప్రాంత దేశాలను వెచ్చదనాన్ని కలిగిస్తాయి. ఉత్తర ప్రాంతానికి వెళ్లే కొద్దీ ప్రవాహంలోని నీళ్లు చల్లబడంటంతో సముద్రం తన ప్రవాహాన్ని తిరిగి భూమధ్య రేఖవైపునకు మార్చుకుంటుంది.

ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందు వల్లే ప్రపంచంలోని చాలా దేశాల్లో మనుషుల మనుగడ సాధ్యమవుతోంది. ఒక వేళ ఈ ప్రక్రియకు గనక బ్రేక్ పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందువల్ల వాతవరణ మార్పుల నేపథ్యంలో శాస్త్రవేత్తలు నిరంతరం సముద్ర ప్రవాహాల లయ ఎలా ఉందనే విషయాలపై పరిశోధనలు జరపుతుంటారు.

ఈ క్రమంలోనే ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టో బ్యూజెర్ట్ తన పరిశీలనకు వచ్చిన అంశాలను తాజాగా వెల్లడించారు. 

తాజా పరిశోధనలో ఏం తేలిందంటే

క్రిస్టో బ్యూజెర్ట్ తన బృందంతో కలిసి గ్రీన్ ల్యాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడుగు భాగం నుంచి  మంచు ముక్కల శాంపిల్‌లను సేకరించారు. అనంతరం వాటినిపై అద్యయనం జరిపి 1,20,000ఏళ్లకు సంబంధించిన డాటాను విశ్లేషించారు. అనంతరం ఆయన అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ పరిస్థితులపై అందోళన వ్యక్తం చేశారు.

గతంలో అంచనా వేసిన సమయానికంటే ముందుగానే ఉత్తరాది సముద్రపు మంచు శరవేగంగా దక్షిణం వైపు విస్తరించి ఫ్రాన్స్, న్యూయార్క్ నగరాలకు చేరుకున్నట్టు చెప్పారు. గతంలో మంచు యుగం ప్రారంభానికి ముందు కూడా ఇటువంటి సంకేతాలే కనిపించాయన్నారు.

అట్లాంటిక్ మెరీడియోనల్ ఓవర్ టర్నింగ్ సర్క్యలేషన్‌లో వేగవంతమైన మార్పుల వల్ల గత మంచు యుగంలో 25 కంటే ఎక్కవ సార్లు ఇటువంటి విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నట్టు చెప్పారు. అయితే గత 11,700 సంవత్సరాలుగా ఏఎంఓసీ స్థిరంగా ఉన్నప్పటికీ శరవేగంగగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల ఫలితంగా క్రమంగా ఏఎంఓసీ బలహీనపడు తుందని వివరించారు.

ఒక వేళ ఏఎంఓసీ నిలిచిపోతే ఐరోపా, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాలు గడ్డకట్టుకుపోయి మంచు యుగం సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారతదేశం, ఆసియా ప్రాంతాల్లోని రుతుపవన వ్యవస్థ కూడా చెబ్బతింటుందన్నారు. కాగా.. ఈ వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రోసీడింగ్స్‌లో ప్రచురితం అయ్యాయి.

మార్పుల వల్ల కలిగే నష్టాలు

ప్రస్తుతం భూతాపం కారణంగా ప్ర పంచ వ్యాప్తంగా ఊష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ.. ఏఎంఓసీ లయ తప్పితే ఊ ష్ణోగ్రత పెరుగుదల శాతం కంటే తగ్గుదల శాతమే అధికంగా ఉంటుంది. ప్ర ధానంగా ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్, ఆసియాలోని పలు ప్రాం తాల్లో ఊష్ణోగ్రతలు తగ్గిపోతాయి. దశాబ్దానికి 1 డిగ్రీ సె ల్సియస్ మేర.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ మేర వాతావరణం చల్లబడిపోతుంది.

ఫలితంగా కొన్ని దశాబ్దాల కా లంలోనే ఆయా ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గిపో యి గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీని పర్యవసానంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పెను తుఫానులు సంభవిస్తే.. మరికొన్ని చోట్ల తిండి దొరకని పరిస్థితులు ఏర్పడతాయి.