మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూలై 11 (విజయక్రాంతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేలా రైతులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కొల్చారం రైతు వేదికలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు ఆయిల్ పాం సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి రైతు వేదికల్లో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి క్లస్టర్ పరిధిలో 20 మంది రైతులతో సేంద్రియ సాగు విధానం చేపట్టాలని, బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరయ్యేలా తోడ్పాటు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసా యాధికారి గోవింద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య, ఆయిల్ పాం సాగు రాష్ట్ర ప్రత్యేక అడ్వయిజర్ శ్రీరంగనాయకులు, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి పాల్గొన్నారు.
జెడ్పీ ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలి
జెడ్పీ ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. గురువారం మెదక్ జెడ్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికలను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.