calender_icon.png 19 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు తయారు చేసిన జాబితాలు ఫైనల్ కాదు

19-01-2025 12:00:00 AM

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరితమ్మ

గద్వాల, జనవరి 18 (విజయక్రాంతి ) :- రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబం ధించి అధికారులు ప్రస్తుతం చూపుతున్న జాబితాలు ఫైనల్ కాదని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజక వర్గ ఇంచార్జీ సరితమ్మ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గ్రామ సభల్లో అవసరమైన పేర్లను వాటిలో చేర్చి గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతనే తుది జాబితాలు తయా రౌతాయని చెప్పారు..

ఈ లోపుగా అధికా రులు తయారు చేసిన జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.గ్రామీణ పట్టణ ప్రాంతాలలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలలో అనరుల పేర్లు, అరుల పేర్లు కనిపించడం లేదని పలు ప్రాంతాల నుంచి తన దృష్టికి ఫిర్యాదులు వచ్చాయనన్నారు.

అధి కారులు తయారుచేసిన జాబితాలో కొన్ని చోట్ల ఒకే రాజకీయ వర్గానికి చెందిన వారి పేర్లు కూడా ఉన్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అయితే ప్రస్తుతం అధికా రులు తయారుచేసిన ఈ జాబితాలు ఫైనల్ కాదని ఈనెల 21 నుంచి 25 వరకు జరగ నున్న గ్రామసభల్లో లబ్ధిదారుల తుది జాబి తాలు తయారవుతాయని తెలిపారు.

గ్రామ సభలలో అధికా రులు తయారుచేసిన జాబితాలను సమీక్షించి వాటిలో నుండి అనరుల పేర్లను తొలగించి అరులైన వారి పేర్లను జాబితాలో చేర్చడం జరుగుతుందని వివరించారు.. ఈ విధంగా గ్రామ సభల్లో సమీక్షించి ఆమోదించిన జాబితాలు మాత్రమే ఫైనల్ అని అందరు గుర్తించాలని సరితమ్మ కోరా రు.

అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లు ఇతర పథకాలు అందేలా అరులైన వారందరి పేర్లు జాబితాలలో ఉండేలా చూసే బాధ్యత తనదేనని చెప్పారు. జిల్లా ఇంఛార్జి మంత్రి, పార్లమెంటరీ సభ్యుడితో కలిసి జాబితాలను చూసిన తర్వాతనే వాటిని ఆమోదించడం జరు గుతుందని వెల్లడించారు.

అధికారులు ఎవరైనా తాము తయారు చేసిన జాబితాలు ఫైనల్ అనే తప్పుడు సంకేతాలు ఇస్తే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని అరతలు కలిగి ఉన్నా ఎంపిక కాని వారు వారు గద్వాలలోని క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అలాంటి వాటిని సరిదిద్దేలా చూస్తామని, నిజమైన అరులకు న్యాయం చేస్తామని సరితమ్మ హామీ ఇచ్చారు