04-03-2025 12:00:00 AM
ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. దినేశ్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దరిమిలా ఈ కథను తెలుగులోకి డబ్ చేసి మార్చి 7న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సోమవారం తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు.
“సింహం పోవచ్చు, కానీ దాని పిల్ల ఇప్పటికీ అడవిలో వేటాడుతూనే ఉంది” అనే పవర్ ఫుల్ లైన్ శంభాజీ ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అక్షయ్ ఖన్నాను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా పరిచయం చేయగా, రష్మిక మందన్న శంభాజీ భార్య యేసుబాయిగా కనిపిస్తుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఇది మామూలు సినిమా కాదు. మన చరిత్రని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా. చాలా అద్భుతమైన ఘట్టాలతో ఈ సినిమా ఉంటుంది. క్లుమైక్స్ చివరి 25 నిమిషాలు ఇండియా మొత్తం కళ్ల వెంట నీళ్లు పెట్టించింది” అన్నారు.