పాక్‌లో బ్లుండ్ టీ20 ప్రపంచకప్
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జరగనున్న బ్లుండ్ టీ20 ప్ర పంచకప్ ఆడేందుకు భారత జట్టుకు దాదాపు లైన్ క్లియర్ అయింది. 17 మందితో కూడిన టీమిండియా టోర్నీ ఆడేందుకు మంగళవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి ఎన్‌వోసీ జారీ చేసింది. అయితే హోం శాఖ, విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఈ టోర్నీ ఈ నెల 22 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనుంది.
లాహోర్, ముల్తాన్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. హోం, విదేశాంగ మంత్రిత్వ శాఖల నుంచి క్లియరెన్స్ లభించాకా ఈ నెల 21న భారత జట్టు వాఘా సరిహద్దు నుంచి పాకిస్థాన్‌కు బయల్దేరి వెళ్లనుంది. ఇక గురు గ్రామ్‌లో 26 మందికి సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన అనంతరం టీ20 ప్రపంచకప్ కోసం 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లుండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) జనరల్ సెక్రటరీ శైలేందర్ యాదవ్ పేర్కొన్నాడు. తొలి మూడు ఎడిషన్స్‌లోనూ భారత్ విజేతగా నిలవడం విశేషం.