23-04-2025 12:00:00 AM
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (విజ యక్రాంతి): రైతులు పండించిన జొన్నల కొనుగోళ్ల పరిమితిని పెం చాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. అదిలాబాద్ జిల్లా జైనథ్, బేలా మార్కెట్ యార్డులో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. క్వింటాలు ధర రూ. 3,371 క్వింటాలు ధరతో కొనుగోలు ప్రారంభం చేయడం జరిగిం దన్నారు.
ప్రతి ఎకరానికి 14 క్విం టాళ్ల కొనుగోలు అనుమతి ఉండగా పరిమితిని పెంచాలన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పి స్తు ప్రభుత్వాలు కొనుగోళ్లు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా గత సీజన్‌లో 25 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగో ళ్లు చేశామన్నారు.
జిల్లాలో పరిస్థితులను బట్టి జొన్నలకొనుగోళ్లపై పరి మితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దళారులను ఆశ్రయించకుం డా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.