calender_icon.png 25 September, 2024 | 6:01 AM

స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయాల దీప్తి

25-09-2024 03:56:56 AM

ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): నేషనల్ సర్వీస్ డే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ దీప్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 670 పబ్లిక్ లైబ్రరీలు, 1000 ప్రైవేటు లైబ్రరీలు, విద్యాసంస్థల్లో 2000 లైబ్రరీలు ఉన్నాయని ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి బు ర్ర వెంకటేశం గవర్నర్‌కు వివరించారు. సెంట్రల్ లైబ్రరీలో గవర్నర్ తిరుగుతూ పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎండీ రియాజ్, పబ్లిక్ లైబ్రరీ డైరెక్టర్ ఈవీ నరసింహ్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.