calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరికి శ్రీరాముడి జీవితం ఆదర్శం

07-04-2025 12:55:23 AM

సంగారెడ్డి/ అందోల్/నారాయణఖేడ్/ పటాన్ చెరు/జహీరాబాద్,ఏప్రిల్ 6 :శ్రీరాముడి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాముని ధర్మపరాయణత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ భక్తులు జీవితంలో అనుసరించాల్సిన అంశాలన్నారు. అలాంటి మహనీయుని కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి  దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం  శ్రీరామనవమి సందర్భంగా  సంగారెడ్డి జిల్లా, జోగిపేటలోని ప్రసిద్ధ పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని, వీర హనుమాన్ ఆలయాన్ని, శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలోని సీతారాముల మందిరాన్ని ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయల్లో ఘనంగా నిర్వహించిన సీతారా మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయ బద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు సత్కారం జరిపారు. ఆలయ పరిసర ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది. సీతారాముల కల్యాణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు శా స్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామానుజాచార్యుల సాంప్రదాయం ప్రకారం, వేద మంత్రాల నడుమ సీతారాముల కల్యాణం జరిగింది.  భక్తులు   అధిక  సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను వీక్షించారు.

భక్తులు ఆనందంగా, శ్రద్ధగా కళ్యాణం తిలకించి ఆధ్యాత్మికతను ఆస్వాదించారు.కళ్యాణానంతరం పూజలు, తీర్థ ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలు  నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ ఏర్పాట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవం భక్తులు తరలివచ్చేలా చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా నిలిచాయి. జోగిపేట పబ్బతి హనుమాన్ దేవాలయం శ్రీరామనవమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.

రాష్ట్ర మంత్రి హాజరైన నేపథ్యంలో ఈ వేడుకకు మరింత పటిష్టత, మహాత్మ్యం చేకూరింది. పట్టణంలోని క్లాక్ టవర్ వద్దనున్న శ్రీ వీర హనుమాన్ ఆలయంలో, శ్రీ రాజరాజేశ్వర ఆలయం వద్దనున్న సీతారామ మందిరంలో  కళ్యాణం మహోత్సవం రంగ రంగ వైభవంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై రాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగ వీక్షించారు. ఈ కార్యక్రమల్లో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, అనాధికారులు, ఆలయ కమిటీ సభ్యు లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అలాగే సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు, ఆందోల్ నియోజకవర్గం లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పాటు పలువురు పాల్గొన్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో హరీష్‌రావు

 సిద్దిపేట: సిద్దిపేటలో శ్రీరామ నవమి వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఒక వైపు  కళ్యాణంలో మరో వైపు ప్రజలతో మమేకం అవుతు, ఆత్మీయ పలకరంపు, ఆధ్యాత్మిక పరవశంతో  శ్రీ రామున్ని దర్శించుకున్నారు. శ్రీ రామాలయం,శ్రీ రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం,శ్రీ దాసంజ నేయ స్వామి దేవాలయం - పాత గంజి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం- రేణుక నగర్, అభయ ఆంజనేయ స్వామి దేవాలయం లింగారెడ్డి పల్లి, హనుమాన్ దే వా లయం నాసర్ పురా, శ్రీ గురు దత్త హెల్పింగ్ సోసైటీ ఖాదర్ పూర 29 వార్డు, హనుమాన్ దేవాలయం గాంధీ నగర్, హనుమాన్ దేవాలయం - సంతోష్ నగర్ కాలనీ,శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం సుభాష్ నగర్ 10 వార్డు, హనుమాన్ దేవాలయం రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీ బాలం జనేయ స్వామి దేవస్థానం ప్రశాంత్ నగర్ 13 వార్డు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం  లెక్చరర్ కాలనీ 14వార్డు, శ్రీ షిరి డి సాయి బాబా దేవాలయం, శ్రీ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయం హనుమాన్ నగర్, శ్రీ ప్రసన్నంజనేయ స్వామి దేవాల యం గణేష్ నగర్, దక్షణ ముఖి ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ నగర్ కాలనీ 5 వ వార్డు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం - హరిప్రియ నగర్, శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం - శివాజి నగర్, శ్రీ మహా అంజనేయ స్వామి దేవస్థానం - రాజేంద్రనగర్ 3వ వార్డు, హనుమాన్ దేవాల యం హౌసింగ్ బోర్డ్ కాలనీ, మహా శక్తి నగర్ ఇలా దేవాలయాల్లో స్వామి ని దర్శించుకున్నారు. 8 గంటల్లో 30 దేవాలయాల్లో జరిగిన సీతారాముల కళ్యాణం ఉత్సవాలలో పాల్గొని హరీష్ రావు అందరివాడని అనిపించుకున్నారు.

 పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్:శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లాలోని శ్రీరాముని ఆల యాల్లో సీతారామ కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన కల్యాణంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూలమాల, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీతికి, ధర్మానికి నిలువుటద్దం శ్రీరా ముడని కొనియాడారు. రాముని అనుగ్రహంతో నియోజకవర్గంలోని ప్రజలంతా  సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొజ్జ పవన్, చంద్రపాల్, రాగి అశోక్, దొంతి లక్ష్మీ ముత్యంగౌడ్, దుర్గాప్రసాద్, గూడూరు ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి పూజలు...

మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతులు శ్రీకోదండ రామాలయంలో నిర్వహించిన కల్యానంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. అనంతరం స్థానిక ఇందిరాపురి కాలనీలోని దాసాంజనేయ ఆలయంలో నిర్వహించిన కల్యాణంలో పాల్గొన్నారు. జక్కన్నపేటలో నిర్వహించిన శ్రీరాముని కల్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, ఆర్కె శ్రీను, బీమరి కిషోర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

చేగుంటలో బియ్యం వితరణ...

శ్రీరామ నవమి సందర్భంగా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో భక్తులకు ఏర్పాటు చేసే అన్నవితరణ కార్యక్రమం కోసం యువ కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బండ్ల రవి, శ్రీనవాస్, మల్లుపల్లి బాపురెడ్డి, శ్రీధర్, మేడి గణేష్ పాల్గొన్నారు.

రాములోరి సన్నిధిలో మాజీ మున్సిపల్ చైర్మన్ పూజలు

రామాయంపేట: శ్రీరామ నవమి  పురస్కరించుకొని రామాయంపేటలో పాండ చెరువు కట్ట వద్ద కళ్యాణ రామచంద్ర ఆలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, బాదె చంద్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నవ్వత్ రాజు. సురేష్   పాల్గొన్నారు.

వేల్పుగొండలో  

టేక్మాల్: టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో రామ చలం గుట్టపై ఆత్మనంద ఆశ్రమ పీఠాధిపతులు రాజయో గి వెంకటస్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవం గా నిర్వహించడం జరిగింది. ఉదయం గ్రామ పుర వీధుల గుండా రామ చలం గు ట్ట పైకి బోనాలు, గండజ్యోతిలు, వివిధ రకాల మొక్కలను భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం సీతారాముల విగ్రహాలను కళ్యాణ వేదికపై స్వాగతించి వేద బ్రాహ్మణ పండితులచే అంగరంగ వైభవంగా సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వ హించారు. సాయంత్రం సీతారాముల పల్లకి సేవ భజన సంకీర్తనలతో గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించడం జరిగింది.

 మునిపల్లిలో

మునిపల్లి,:  శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం  మం డల పరిధిలోని చిన్నచెల్మెడ  గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో రాష్ట్ర వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ పాల్గొన్నారు.   ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి   ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం చిన్నచెల్మెడ గ్రామానికి చెందిన కాంగ్రెస్  సీనియర్ నాయకులు గడ్డమీది  సంగన్న ఇటీవల మృతి చెందిన విషయం  తెలిసిందే. మంత్రి  వారి ఇంటికి వెళ్ళి  కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు  ముందు  సంగన్న చిత్ర పటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బు ర్కల పాండు,   మాజీ ఎంపీటీసీ వెంకట్రాములు,  మాజీ కో ఆప్షన్ సభ్యుడు  రహీం, కాంగ్రెస్ నాయకులు రుద్ర క్రిష్ణ, వీరన్న తదితరులు  ఉన్నారు.

చేగుంటలో 

చేగుంట : శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను చేగుంట మండలంలో  భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. చేగుంట పట్టణ కేంద్రంలో  శ్రీ సీతారామ కల్యాణ వేడుకలకు తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండలంలో ఉన్న చందాయిపెట్, మక్కరాజిపేట, గొల్లపల్లి, ఇబ్రహీంపూర్, వడియారం, కర్నాల పల్లి  గ్రామాల్లో ఆలయ కమిటీ సభ్యులు వేడుకలు నిర్వహించారు. చేగుంట పట్టణ కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు, జిల్లా వాలీబాల్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి తో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్  కల్యాణంలో పాల్గొన్నారు.  అనంతరం అన్నదాన కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వడ్ల నవీన్కు మార్ పాల్గొన్నారుపాల్గొన్నారు.