- బిచ్కుంద,మద్నూర్,జుక్కల్ మండలాలకు సాగునీరు
- ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు వెల్లడి
కామారెడ్డి, ఆగస్టు 30 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల రైతులకు సాగునీటిని అందించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గోద్‌గావ్‌లో నిర్మిస్తున్న లెండి ప్రాజెక్ట్ పనులు 2025లోగా పూర్తవుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్, రైతు నాయకులతో కలిసి వెళ్లి లెండి ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించి నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరారు.
ప్రాజెక్ట్ పూర్తయితే మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం లెండి ప్రాజెక్ట్‌ను గాలికి వదిలేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం తో ప్రాజెక్ట్ నిర్మాణంపై చర్చలు జరుపుతోందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపా రుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టంచేశారు.