నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండల పరిధిలోని ఔదత్ పూర్ గ్రామంలో నేడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుల గణన సర్వేలో అధికారులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి పూర్తిస్థాయిలో కుటుంబ వివరాలను నమోదు చేయించాలని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గ్రామస్తులను కోరారు. యుద్ద ప్రాతిపదికన జరిగే ఈ సర్వేలో నాయకులు ప్రత్యేకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గన్ని రోల్ మోడల్ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నర్సింగ్ రావు పాటిల్, గుండేరావు పాటిల్, అనిల్ పాటిల్, సంజీవ్ పాటిల్, దేవ రెడ్డి, మాజీ సర్పంచ్లు, సంతోష్, సచిన్ పాటిల్, అంబ్రేష్, హన్మంతు, రహీమ్, పండరి, నర్సింగ్, ఆకాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.