calender_icon.png 11 January, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా నెలాఖరున వస్తున్నాడు!

09-01-2025 12:00:00 AM

యుగాలు, తరాలు మారినా.. రామాయణ కథ మాత్రం ఎప్పటికీ రమ్యంగానే ఉంటుంది. ఇది తెరపై ఎన్నో సార్లు వచ్చినా కూడా ఆదరణలో మార్పుండదు. రామాయణ కథలో మార్పేమీ లేకున్నా కూడా ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ కథ యానిమేషన్ రూపంలోనూ రూపొందింది. ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ యానిమేటెడ్ మూవీ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ 4కే వర్షన్ విడుదల కానుంది. ఈ చిత్రం గతేడాది అక్టోబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది.. కానీ కొన్ని పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. రామ్‌మోహన్, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రాన్ని గీక్ పిక్చర్స్ ఇండియా, ఏఏ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఈ మూవీ ట్రైలర్ ఇదే నెల 10వ తేదీన విడుదల కానుంది. వాస్తవానికి 1993లోనే ‘రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా’ ఈ యానిమేటెడ్ చిత్రాన్ని రూపొందించి 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోనూ ప్రదర్శించారు కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు థియేటర్లలో ప్రదర్శించలేకపోయారు. 2000 సంవత్సరంలో టీవీలో టెలికాస్ట్ చేశారు.