calender_icon.png 17 January, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తాలేని ప్రతిపక్షనేత!

08-08-2024 01:21:57 AM

ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ ఒక్క రోజు మాత్రమే పాల్గొన్నారు. గత నెల 24న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హాజరైన మాజీ సీఎం.. మీడియా పాయింట్ వద్ద ప్రసంగించి విమర్శలు చేసి వెళ్లారు. బడ్జెట్‌లో గ్యాస్, ట్రాష్ తప్ప ఏం లేదంటూ వెళ్లిన ఆయన ఈ నెల 2 వరకు జరిగినా సమావేశాలకు ఒక్కసారైనా తిరిగి రాలేదు. బడ్జెట్‌పై చర్చలో పాల్గొనలేదు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రతిపక్ష హోదాలో కూర్చునే సరికి సభకు వచ్చేందుకే ఆసక్తి చూపలేదు. ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్ష నేత ఇలా పత్తా లేకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎక్కడ కూడా ఆయన ప్రజాకార్యక్రమాల్లో కనిపించకపోవడం గమనార్హం.