11-03-2025 12:25:52 AM
సదరు నాయకుడి ఫొటోకు చెప్పుల దండ
రాజేంద్రనగర్, మార్చి 10: గత 15 రోజు ల క్రితం పెళ్లయిన యువతితో ఓ నాయకుడు పరారైన ఘటన లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది. ఓ పార్టీ గోల్కొండ డివిజన్ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అరవింద్‌కు భార్య, పదేళ్ల కూతురు ఉంది. లంగర్ హౌస్ గొల్లబస్తీలో నివసించే ఓ యువతితో కొన్నేళ్లు అరవింద్ ప్రేమాయాణం నడిపాడు. సదరు యువతికి అత్తాపూర్‌కు చెందిన యువకుడితో 15 రోజుల క్రితమే వివాహం అయిం ది.
అయితే గత శనివారం ఆమెను బండ్లగూడ సమీపంలోని ఆరె మైసమ్మ ఆలయా నికి పిలిచాడు. అక్కడికి వచ్చిన యువతిని తీసుకొని అరవింద్ పారిపోయాడు. దీంతో బస్తీవాసులు ఆగ్రహంతో అరవింద్ ఫొటో కు చెప్పుల దండ వేశారు. కాగా యువతి కుటుంబ సభ్యులు శనివారంనాడే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించారు.