calender_icon.png 5 November, 2024 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టును తప్పుదోవ పట్టించిన వకీల్..

05-11-2024 12:35:24 AM

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

నాగర్‌కర్నూల్, నవంబర్ 4 (విజయక్రాంతి): భూమి కొనుగోలు చేసి న హక్కుదారులకు భూమి దక్కకుం డా లేని వారసులను సృష్టించి 12 ఎకరాల భూమిని కాజేయాలనుకున్న న్యాయవాదిపై సోమవారం నాగర్‌కర్నూల్ ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. తిమ్మాజిపేట మం డలం మారేపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు బాలనాగయ్య, బీర్ల భీమయ్య, ఇప్పలపల్లి అంజనేయు లు, అంకూరి మన్యం, పసుపుల మాసయ్య.. అదే గ్రామానికి చెందిన హరిజన సాయన్న వద్ద 12.16 గుంట ల భూమిని 1964లో కొని, సాగులో ఉన్నట్లు తెలిపారు.

2023లో పట్టాకోసం రెవెన్యూ ఆఫీసుకు వెళ్లగా వారి వద్ద భూమి కొన్నట్టు ఎటువంటి పత్రం లేకపోవడంతో కోర్టు నుంచి డిగ్రీ కావాలని అధికారులు కోరినట్లు తెలిపారు. దీంతో న్యాయవాది రాంచందర్‌ను ఆశ్రయించగా రూ.2లక్షలు కోర్టు ఖర్చుల పేరుతో తీసుకుని, కొత్త వ్యక్తులను వారసులుగా కోర్టు ముందు ఉంచి వారికి అనుకూలంగా డిగ్రీ ఇప్పించాడని ఆరోపించారు. దీంతో సోమవారం న్యాయవాదిపై చర్యలు తీసుకోవాల ని ఫ్లెక్సీలు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఇది ఇలా ఉంటే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రాంచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.