calender_icon.png 23 March, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ చెక్కు పంపిణీ చేసిన తాజా మాజీ సర్పంచ్ మాధవి నవీన్ గౌడ్

22-03-2025 04:56:14 PM

హత్నూర: హత్నూర మండల పరిధిలోని మధుర గ్రామానికి చెందిన కుమ్మరి మౌనిక, కుమారుడు ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం సీఎంఆర్ దరఖాస్తు చేసుకోగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో మంజూరైనటువంటి 60 వేల రూపాయల చెక్కును శనివారం మధుర గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులకు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాధవి నవీన్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అడగగానే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.