ముషీరాబాద్, జనవరి 12 : సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో పడి మృతిచెందిన భోలక్‌పూర్ డివిజన్ ఇందిరానగర్ ఫస్ట్‌వెంచర్‌కు చెందిన అన్మదమ్ములు ధనుష్, లోహిత్‌ల అంత్యక్రియలు ఆదివారం స్థానికంగా ముగిసా యి.
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎంపీ వీ హనుమంతారావు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జైసింహ భోలక్‌పూర్‌కు చేరుకొని మృతదేహాలకు నివాళి అర్పించారు. మృతుల తల్లిదండ్లులకు ధైర్యం చెప్పారు.
అంబర్‌పేటలోని హర్రాస్ పెంట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించా రు. బాధిత కుటుంబానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రూ. 10వేల ఆర్ధిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.