సినిమా రంగంలో ఒక ఐకాన్‌గా ఎదిగింది సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. ఇటీవల ‘గుల్మొహర్’, ‘రాకెట్రీ’ వంటి చిత్రాలతో జాతీయ అవార్డులను పొందింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చివరిసారిగా ‘అంధగన్’లో తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంది. హిందీ చిత్రం ‘అంధాదున్’కు తమిళ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రతినాయకిగా మెప్పించింది. ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 28 ఏళ్లు పూర్తవుతుండగా, తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది సిమ్రాన్.
తన భర్త దీపక్ బగ్గా ఈ హారర్ ఫాంటసీ మూవీని ‘ది లాస్ట్ వన్’ పేరుతో పాన్ఇండియా వెంచర్‌గా నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈ చిత్రంలోని తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. మునుపెన్నడూ చేయని జానర్లో రాబోతున్న ఈ చిత్రంలో తాను కొత్త అవతార్‌లో కనిపిస్తానని, తనకిది కెరీర్లో ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ అని పేర్కొంది. లోకేశ్‌కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఫోర్ డీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది.