మాంచెస్టర్: ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1 తేడాతో సమం అయింది. మొదటి టీ20లో కంగారూలు విజయం సాధించగా, రెండో టీ20లో ఇంగ్లిష్ బ్యాటర్లు సత్తా చాటారు. ఇక మూడో టీ20లో గెలిచిన వారినే సిరీస్ వరిస్తుందని అనుకున్న వేళ.. వరణుడు మ్యాచ్‌ను తుడిచిపెట్టేశాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశచెందారు. ఎంత సేపటికీ వర్ష ప్రభావంతో తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం ప్రకటించేశారు. ఈ రెండు జట్ల మధ్య 19వ తేదీ నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది.