calender_icon.png 4 March, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి ఆయకట్టుకు నీరందించాలి

04-03-2025 01:18:38 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, మార్చి 3(విజయక్రాంతి): పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ మండలం మాచారం ,రాంపూర్  ఏరియాలో గల వనదుర్గ ప్రాజెక్ట్ నుండి పొలాలకు సాగునీరు అందించే ఎంఎన్  కాలువను దానికి సంబంధించిన పిల్ల కాల్వల ద్వారా పంట పొలాలకు అందించే సాగునీరును సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు పరిధిలో  పంటలు ఎండిపోకుండా ఉండేందుకు నీటి సరఫరా సమర్థవంతంగా అమలు చేసేందుకు నీటి పారుదల శాఖాధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు.  ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగు నీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. సింగూర్ ప్రాజెక్ట్ నుండి 4.06 టీ.ఎం.సీ సాగునీరు వనదుర్గ ప్రాజెక్ట్ కు అలికేషన్ ఉందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో  21 వేల 625  ఎకరాలకు సాగు నీరు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. జనవరి 15 నుండి ఏప్రిల్ చివరి వరకు సాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట ప్రణాళికతో పది విడుదలలో సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 4 విడతల్లో సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై చర్యలు : అదనపు కలెక్టర్ నగేశ్

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాల ని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్,  గ్రామ పంచాయతీ ప్రాంతాలలో దరఖాస్తు చేసుకున్న వాటిని క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృం  దాలు పరిశీలించి, సమస్యలు లేని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. నీటిపా రుదల శాఖఎఫ్టీఎల్, రెవెన్యూ ప్రభుత్వ భూమి,  చెరువు శిఖం, దేవాదాయ, నాలా లను తనిఖీ చేయాలన్నారు. డిఆర్‌ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీపీవో యాదయ్య, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, అధికారులు, ఎంపీవోలు, పాల్గొన్నారు.