calender_icon.png 15 March, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుచేసిన చివరి ఆయకట్టుకు నీరందించాలి..

11-03-2025 08:34:50 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...

పాపన్నపేట: ఘనపురం ప్రాజెక్టు కింద సాగు చేసిన చివరి ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఘనపురం ప్రాజెక్టు ఫతేనహర్ కెనాల్ ద్వారా నీటి సరఫరా జరిగే ఆయకట్టు చివరి గ్రామలైన ఎల్లాపూర్, శానాయపల్లి, పొడిచినపల్లి గ్రామాలలోని నీటి పారుదల వ్యవస్థ, సాగు చేస్తున్న వరి పంటలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సాగు చేస్తున్న వరి, ఇతర పంటలకు నీటి తడుల కారణంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆయా గ్రామాల్లో రైతులను పంటలకు నీటి లభ్యత, పంట దశలో ఏమైనా సమస్యలు ఎదరువుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బోరుబావుల ఆధారంగా సాగవుతున్న వరి పంటను గురించి సైతం రైతులను అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత నీటి వనరులు, పంట రకాలు ఇతర సమస్యలపై రైతులను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సరైన అవసరమైనా తోడ్పాటు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఏ.ఈ విజయ్ కుమార్, సంబంధిత అధికారులు రైతులు తదితరులు ఉన్నారు.