* రాష్ట్రపతి భవన్ సమీపంలో ఏర్పాటు
* ఫ్రాన్స్, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సమీపంలో రైసీనా హిల్స్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ‘యుగ యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం’ పేరిట దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మ్యూజియం నిర్మాణంలో ఫ్రాన్స్ సహకారం అందించనుంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. యుగ యుగే న్ భారత్ నేషనల్ మ్యూజియం భారతదేశ 5 వేల ఏండ్ల చరిత్రను తెలియజేస్తుంది. రైజీనా హిల్స్‌లోని నార్త్, సౌత్ బ్లాక్ భవనాల్లో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 1.17 లక్షల చదరపు అడుగు ల్లో, 950 గదులతో ఈ మ్యూ జియం ఉంటుంది. ఇరు దేశాల ఒప్పందం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడు తూ.. రాష్ట్రపతి భవన్ సమీపంలో ఏర్పాటు చేయబోతున్న మ్యూజి యం మన దేశ సంస్కృతి, వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.