ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, అక్టోబర్ 5 (విజయక్రాంతి): పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు జీవీమాల్ యాజమాన్యం ఖమ్మంలో హైదరా బాద్‌కు దీటుగా బ్రాండెడ్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడం అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ వస్త్ర దుకాణాన్ని మంత్రి తుమ్మ ల శనివారం సినీ తార కీర్తి సురేశ్‌తో కలిసి ప్రారంభించారు.
దేశంలోని ఇతర ప్రాంతా ల్లో లభించే అన్ని రకాల వస్త్రాలను ఖమ్మంలోనే తక్కువ ధరకు లభించేలా అందు బాటులో ఉంచడం ఎంతో అభినందనీయమన్నారు. జీవీ మాల్ అధినేత గుర్రం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తమ ఉన్నతి కి కారణమైన ఖమ్మం ప్రజల రుణం తీర్చుకునేందుకే ఇంత భారీగా వస్త్ర దుకాణాన్ని నెలకొల్పామని అన్నారు.
ఖమ్మంలో మొదలైన ఈ జైత్రయాత్ర 17 బ్రాంచ్‌లతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించామని చెప్పారు. కార్యక్రమంలో జీవీమాల్ అధినేతలు గుర్రం వాసు, గుర్రం మురళీ, నగర మేయర్ పీ నీరజ, కార్పొరేటర్ కే మురళీ పాల్గొన్నారు.