calender_icon.png 24 October, 2024 | 9:23 AM

భూమి రికార్డుకెక్కలేదని..

02-08-2024 02:13:55 AM

గుండెపోటుతో రైతు మృతి

గజ్వేల్, ఆగస్టు 1: తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని రికార్డుకెక్కించాలంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతుకు అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో మానసికంగా కుంగిపోయిన రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే గుండెపోటుకు గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకె ళ్లగానే మృతిచెందాడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రా జ్‌పల్లికి చెందిన రైతు బోండ్ల పోచయ్య (43)తో పాటు అతని ఇద్దరు అన్నదమ్ముల నుంచి 4 ఎకరాల భూమిని ఆర్ అండ్‌ఆర్ కాలనీ, కెనాల్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంది. అందుకు బదులుగా అధికారులు ముగ్గురు అన్నదమ్ములకు 12 గుంటల చొప్పున మరోచోట భూమి కేటాయించారు.

అయితే, అధికారులు పోచ య్యతో పాటు అతని అన్నదమ్ములకు కేటాయించిన భూమిని వారిపై రికార్డుల్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వారు రోజూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికా రులు భూమిని నమోదు చేయలేదు. బుధ వా రం కూడా పోచ య్య గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అప్పటికే చాలాసార్లు తిరగడం, అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో మానసి కంగా కుంగిపోయిన పోచయ్యకు గుండెనొప్పి వచ్చి పడిపోయాడు.

స్థానికులు, బంధువులు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి అనంతరం ఆర్వీఎం ఆసు పత్రికి తీసుకువెళ్లారు. కానీ అక్కడికి వెళ్లేలోపే పోచయ్య మృతిచెందాడు. కాగా, గతంలోనూ భూములు రికార్డుకు ఎక్కలేదన్న ఆవేదనతో ఇదే గ్రామానికి చెందిన రైతులు మాదగారి నర్సయ్య, చిక్కుడు నర్సింలు గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు పోచయ్య కూడా మృతిచెందడంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.