calender_icon.png 10 March, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ల్యాంప్ చిన్న చిత్రాలకు వెలుగు అవ్వాలి

08-03-2025 12:00:00 AM

వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీరావు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ల్యాంప్’. రాజశేఖర్ రాజ్ దర్శకత్వంలో చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై జీవీఎన్ శేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్దన్‌రెడ్డి, పీ నవీన్‌కుమార్‌రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్ల ద్వారా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న చిత్రాలకు ఆదరణ లేక చీకటి అలుముకుంది. ఆ చీకట్లను పోగొట్టి వెలుగు నింపే దీపం ఈ ‘ల్యాంప్’ సినిమా కావాలి” అన్నారు.

చిత్ర కథానాయకుడు వినోద్ నువ్వుల మాట్లాడుతూ.. ‘టీమ్ సహకారంతో ఈ సినిమా విజవంతంగా పూర్తిచేశాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మేకింగ్‌లో ఎన్నో కష్టాలు పడ్డాం. అయినా ఈ మూవీని కాపాడుకుంటూ వచ్చాం’ అన్నారు. ‘ల్యాంప్ మూవీ ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుంది’ అని నిర్మాత జీవీఎన్ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీ ప్రముఖులు, చిత్రబృందం పాల్గొన్నారు.