calender_icon.png 22 September, 2024 | 4:34 AM

లడ్డూ కల్తీ దిగ్భ్రాంతికరం

22-09-2024 01:24:31 AM

  1. భక్తుల విశ్వాసంపై తూట్లు పొడవడమే 
  2. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సమాచారం  తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది భక్తుల విశ్వాసానికి తూట్లు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు, ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. నేరస్తులకు తగిన శిక్ష పడాలని కోరారు. ఈ దిశగా పోలీసు యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్తున్నాయని ఆశిస్తున్నామని తెలిపారు.

పవిత్రంగా భావిం చే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుల ను, చేపనూనెలను వినియోగించడం క్షమించరాని నేరమన్నారు. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుం డా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు తిరుపతిలో అన్య మత ప్రచారం, తిరుమల కొండపైకి మద్యం, మాంసాహారాన్ని తీసుకెళ్లడం, టీటీడీలో అవినీతి అక్రమాలు గత కొన్నేళ్లుగా పతాక శీర్షికలవుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలను పరిరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పదేపదే తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు భక్తుల నమ్మకం, విశ్వాసం సడలే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.