19-03-2025 07:47:54 PM
సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్..
జాజిరెడ్డి గూడెం(అర్వపల్లి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ అన్నారు. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రధాన చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం అలుపెరగని పోరాటం నడిపిన కామ్రేడ్ భీంరెడ్డి నర్సింహారెడ్డి సోదరిగా తన స్థాయికి మించి సాయిధ దళంలో పోరాటం చేస్తూ పేద ప్రజలకు అండగా నిలిచిందని కొనియాడారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు ఎల్లెంల అవిలయ్య, శిగ వెంకన్న, నిమ్మనగోటి అబ్బులు, కొమ్ము విజయ్, మద్ది రాజయ్య, వజ్జె వినయ్, వజ్జె సైదయ్య, నరేందర్, బొల్లం జానయ్య, నర్సయ్య, సైదులు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.