12-02-2025 01:08:05 AM
* కాంగ్రెస్ పాలనతో నష్టపోయామన్న భావనలో ప్రజలు
* దగ్గర్లోనే ప్రభుత్వంపై జనాలు తిరగబడే రోజులు
* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కేసీఆర్ సీఎంగా లేని లోటు ప్రజ లకు తెలిసిందని,ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామని వారు భావిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమా ర్ నివాసంలో మంగళవారం నిర్వహించిన ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల ఆత్మీ య సమావేశానికి కేటీఆర్ హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పు ట్టిన రోజుల వేడుకలకు హాజరయ్యేందుకు హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్న మంత్రులు.. ఖ మ్మం వరదలప్పుడు మా త్రం వాటిని పంపలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల ఓకుటుంబం వరదల్లో కొట్టుకు పోయిందని విమర్శించారు.
డిప్యూటీ సీఎం తో కలిసి ఖమ్మంలో జిల్లాలో ముగ్గురు మం త్రులు ఉన్నప్పటికీ వాళ్ల వల్ల వరద సమయంలో పైసా ప్రయోజనం జరగలేదని దు య్యబట్టారు. రాష్ట్రంలో ఏ పనికి సంబంధించిన కాంట్రాక్టు అయినా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందని ఆరోపించా రు. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు.
డిప్యూటీ సీఎం 30 శాతం కమిష న్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నారన్నారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించా రు. త్వరలోనే ఖమ్మంలో పర్యటిస్తానన్నారు.