19-03-2025 12:00:00 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ పుష్కర కాలం తర్వాత ‘జైలర్’తో మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఏడు పదుల వయసులోనూ రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించారు రజనీ. ఆ తర్వాత ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేసిన ‘వేట్టయాన్’ మాత్రం కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు రజనీ.
నాగార్జున ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది.
ఇలా భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా షూటింగ్ పూర్తయ్యిందని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.