calender_icon.png 6 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం తెస్తున్న లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

06-02-2025 01:27:55 AM

ఆర్టీసీ జేఏసీ డిమాండ్

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): 26 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాలరాసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆర్టీ సీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్త నిరసనలో భాగం గా బుధవారం ట్యాంక్ బండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. వెంటనే 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.