05-04-2025 10:31:35 PM
బిఆర్ఎస్ చెన్నూరు ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్..
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితోనే మండలంలోని క్యాతనపల్లి రైల్వే వంతెన నిర్మాణం పూర్తయిందని బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తి కాగా శనివారం ఫ్లై ఓవర్ వంతెనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజి మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ల చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుందన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణానికి సరిపడ నిధులను మంజూరు చేయించడంలో బాల్క సుమన్ కృషి మరువలేనిదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ చెన్నూరు నియోజక వర్గం అభివృద్ధికి సరిపడ నిధులు విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు. క్యాతనపల్లి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు చెన్నూరు మాజి ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వేల్పుల రవి, మాజీ కో ఆప్షన్ సభ్యులు సుదర్శన్ గౌడ్, నాయకులు బడికెల సంపత్, రామిడి కుమార్, వాసు, మహేష్ లు పాల్గొన్నారు.