calender_icon.png 21 January, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురియన్ కమిటీ విచారణ పూర్తి

13-07-2024 01:42:01 AM

పార్టీ వైఫల్యంపై కాంగ్రెస్ నేతల అభిప్రాయ సేకరణ 

ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులతో రెండు రోజులు విడివిడిగా భేటీ 

ఈ నెల 21న ఏఐసీసీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ 

ఐక్యంగా పని చేయడం వల్లే విజయం సాధించామని పలువురి వెల్లడి

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన కురియన్ కమిటీ అభిప్రాయ సేకరణ ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 8 సీట్లకే పరిమితం కావడా నికి గల కారణాలపై రెండు రోజుల పాటు ఎంపీలు, ఓడిన అభ్యర్థులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల నుంచి వివరాలు సేకరిం చారు. ఒక్కో వ్యక్తికి దాదాపు 30 నిమిషాల సమయం కేటాయించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. వాటి ఆధారంగా ఒక నివేదిక తయారు చేసి ఈ నెల 21 ఏఐసీసీకి కురియన్ కమిటీ అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినదాని కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తక్కువగా ఎందుకు వచ్చాయి? కొన్ని నియోజకవర్గాలో అసెంబ్లీ కంటే పార్లమెం ట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు రావడానికి ఎలాంటి వ్యూహంతో ముందు కెళ్లారనే వాటిపైనా చర్చించారు. సమావేశం లో అభిప్రాయాలు చెప్పలేని వాళ్లు ఫోన్‌లో గాని, రాతపూర్వకంగా అభిప్రాయ లు ఇవ్వా లని కురియన్ కమిటీ సూచించిన ట్లుగా తెలిసింది. అయితే లోక్‌సభ ఎన్నికల విష యంలో కొందరు బీజేపీ, బీఆర్‌ఎస్ అం తర్గత ఒప్పందం, టికెట్ల కేటాయింపు ఆల స్యం కావడం కారణమని చెప్పగా, మరి కొందరు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల కూడా ప్రతికూ ల ఫలితాలు వచ్చాయని చెప్పినట్లు గా సమాచారం.

ఇక భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూర్, జహీరాబాద్, మహబబూబాబాద్‌లో ఎమ్మె ల్యేలు, ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులు మా త్రం కార్యకర్తల నుంచి నాయకుల వరకు కలిసి ఐక్యంగా పనిచేయడం వల్లే భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు వివరిం చారు. మెదక్‌లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసిన జగ్గారెడ్డి 8 వేల ఓట్లతో ఓటమి చెందగా, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 7 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. సంగారెడ్డి నియోజకవర్గంలో తీసుకున్న వ్యూహాలను మిగతా వాటిలో అనుసరిస్తే ఎంపీ ఎన్నికల్లో రెండు, మూడు సీట్లు పెరగడానికి అవకాశం ఉండేదనే అంశం చర్చకు వచ్చినట్లుగా తెలిసింది.

గ్రేటర్ పరిధి లో పార్టీ బలోపేతానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించినట్లుగా సమాచారం. నల్ల గొండ పార్లమెంట్ పరిధిలోని కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎమ్మెల్యే పద్మావతి వివ రించారు. బూత్‌వారీగా పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను కురియన్ కమిటీకి అందిం చగా, తనను అభినందిచారని ఆమె తెలిపా రు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మెజార్టీ రావ డానికి గల కారణాలంటేని అడిగితే బీఆర్ ఎస్‌పైన ఉన్న వ్యతిరేకతనే కారణమని చెప్పి నట్లు ఎమ్మెల్యే పద్మావతి చెప్పారు. 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి: 

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి 

రాష్ట్ర జనాభాలో మొత్తంలో 43 శాతం వరకు జనాభా ఉన్న హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు లేకపోవడం ఇబ్బందిగా ఉందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలు.. అందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని, దీంతో అభివృద్ది కూడా ఆగిందని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో కురియన్ కమిటీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. ఈ రెండు జిల్లాలలో మంత్రి పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలే బలంగా ఉన్నాయని తెలిపారు. పార్టీలో తాను సీనియర్‌నని, మంత్రి పదవి కావాలని కోరినట్లు చెప్పారు.

శ్రీరాముని అక్షింతలు.. టికెట్ ఆలస్యమే కారణం

కరీంనగర్ పార్లమెంట్ ఓటమికి శ్రీరాముని అక్షింతలు, ఆలస్యంగా టికెట్ కేటాయించడమే ప్రధాన కారణమని ఉమ్మ డి జిల్లా నేతలు వెల్లడించారు. శ్రీరాముని అక్షింతలను తొమ్మిది నెలల ముందే ఆరు లక్షల కుటుంబాలకు 500 మంది వాలం టీర్లు చేర్చారని, అలాగే ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ 6 లక్షల ఇండ్లకు శ్రీరాముని చిత్రపటాన్ని చేర్చారని ఈ సెంటిమెంట్ ప్రధానంగా పనిచేసిందన్నా రు. అలాగే సంజయ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు నిగా పనిచేసి ఉండడం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపాలు కావ డం, సిట్టింగ్ ఎంపీగా ఉండి పోటీ చేయడంతో ఆయన శ్రీరాముని అక్షింతలతో పాటు సానుభూ తిని క్యాచ్ చేసుకున్నారని తెలిపారు.

పార్ల మెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావుకు 16 రోజుల ముందు టికెట్ ఇవ్వడం వల్ల ప్రచార సమయం సరి పోలేదని, నెల లేదా 40 రోజుల ముందు ఇచ్చి ఉంటే మరో లక్షకుపైగా ఓట్లు సాధించి ఉండేవారని వివరించారు. పార్లమెంట్ టికెట్ల విషయం లో ఖమ్మం, కరీంనగర్ ము డిపడి ఉండడం వల్ల టికెట్ ఆలస్యమైందని, వెలిచాల రాజేం దర్‌రావు 3 లక్షల 62 వేల ఓట్ల వరకు సాధించగలిగారని వివరించారు. పార్టీ అభ్యర్థి కోసం అందరు కలిసికట్టుగా పనిచే శారని వివరించారు. 

రాజీనామా చేయకుండానే చేర్చుకోలేదా?

బీఆర్‌ఎస్‌ను కూలగొట్టడం ఖాయం : మాజీ మంత్రి షబ్బీర్ అలీ

బీఆర్‌ఎస్ హయాంలోనే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మొత్తం 47 మందిని రాజీనామా చేయించకుండానే పార్టీలో చేర్చుకున్న విషయం కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వలేదా? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్న విషయం మర్చి పోయావా? ఇది వాస్తవం కాకుంటే నా పదవికి రాజీనామా చేస్తా ? లేదంటే కేటీఆర్ రాజీనామా చేయాలని షబ్బీర్‌అలీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అంగట్లో పశువులను కొన్నట్లుగా కొనుగోలు చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్లు అభివృద్ధి కోసం వస్తు న్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ విలీనం చేసుకున్నట్లుగానే ఇ ప్పుడు ఆ పార్టీని తాము విలీనం చేసుకుంటామని, త్వరలోనే అందరు కాం గ్రెస్‌లోకి వస్తారని అన్నారు.