calender_icon.png 15 January, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కత ఘటన నన్ను కలిచివేసింది

31-08-2024 12:00:00 AM

కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ కేసు తర్వాత 2012లో ‘జస్టిస్ వర్మ కమిటీ’ ఏర్పాటు చేసినప్పటికీ అత్యాచార కేసులు తగ్గలేదని బాధను వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు అత్యంత ప్రమాదకరమన్నారు. మహిళల భద్రత కోసం అనేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నప్పటికీ కోల్‌కత లాంటి దారుణమైన ఘటనలు తగ్గకపోవడం సిగ్గుచేటు అని అన్నారు.

అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశంలో అత్యాచార కేసులు పెరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలను తక్కువ శక్తిమంతులుగా, తక్కువ తెలివితేటలు ఉన్నవారిగా భావించేవారిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కొందరు స్త్రీని ఒక వస్తువుగా చూపే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనలతో దేశం ఆగ్రహానికి గురికావడం ఖాయం. నేను కూడా డాక్టర్ ఘటనపై  భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. నేటికీ కోల్ కతాలో విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు చేస్తున్న ఆందోళనలు నన్ను కలిచివేశాయని అన్నారు. చాలామంది బాధితుల్లో కిండర్ గార్టెన్ అమ్మాయిలు కూడా ఉన్నారని ముర్ము అన్నారు.