- రైతుల పొలాలను ముంచెత్తిన నీళ్లు
- వెల్దండ మండలం డి-82 వద్ద ఘటన
కల్వకుర్తి, డిసెంబరు 1: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువకు గండిపడింది. వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామశివారులోని డి-82 వద్ద ఆదివారం తెల్లవారుజామున నీటి ఒత్తిడికి గండిపడి నీరంతా పంటపొలాల్లోకి మ ల్లింది. బోరుమోటర్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే పలుమార్లు గండిపడి నీరంతా వృథాగా పోయినా మరమ్మతు పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతోనే గండ్లు పడుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు.