calender_icon.png 16 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం తీసిన పతంగులాట

16-01-2025 03:11:35 AM

* సంక్రాంతి వేడుకల్లో అపశ్రుతి

*  వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

*  మరో ఘటనలో బిల్డింగ్ నుంచి జారి వ్యక్తి మృతి 

నిర్మల్ జనవరి 15, (విజయక్రాంతి)/ రాజేంద్రనగర్/ పటాన్‌చెరు: పతంగి ఎగిరేసేందుకు మేడపైకి వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్‌లోని పాత కూరగాయాల మార్కెట్‌కు చెం  మొహ్మద్ హుజేఫ్ (11) 5తరగతి చదువుతున్నాడు. గాలిపటం ఎగరేయడానికి మేడపైకి ఎక్కాడు.

పతంగిని ఎగిరేసే క్రమం  కాలు జారీ మేడపై నుంచి పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని నిర్మల్ ప్రభుత్వాఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి మొహ్మద్ షఫీకి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు, రెండో కుమారుడైన హుజేఫ్ ప్రమా  మృతిచెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గాలిపటాలు చూసేందుకు వెళ్లి..

గాలిపటాలు ఎగిరేస్తుండగా చేసేందుకు బిల్డింగ్‌పైకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. మృతుడి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. కాటేదాన్‌కు చెందిన మాధవరావు బుధవారం బిల్డింగ్‌పైన తన పిల్లలు పతంగులు ఎగురవేస్తుండగా సరదాగా వారిని చూసేందుకు వెళ్లాడు. ఈక్రమంలో నాలుగో అంతస్తులో ఆయన కాలుజారడంతో కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు.  

గొంతుకోసిన చైనా మాంజా

రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి చైనా మాంజా గొంతుకు తాకి తీవ్రంగా గాయపడ్డాడు. బీడీఎల్ భానూర్ పీఎస్ పరిధిలోని కర్దనూర్ మెయిన్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. సీఐ స్వామిగౌడ్ తెలిపిన మేరకు.. షాపూర్ సమీపంలోని సురారం పట్టణానికి చెందిన వెంకటేశ్ (30) మధ్యాహ్నం పటాన్‌చెరు వైపు నుంచి తన బైక్‌పై వికారాబాద్ వెళ్తుండగా కర్దనూర్ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.